మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Dhanvantari Ashtottara Shatanama Stotram – శ్రీ ధన్వంతర్యష్టోత్తరశతనామ స్తోత్రం
ధన్వంతరిః సుధాపూర్ణకలశాఢ్యకరో హరిః |
జరామృతిత్రస్తదేవప్రార్థనాసాధకః ప్రభుః || 1 ||
నిర్వికల్పో నిస్సమానో మందస్మితముఖాంబుజః |
ఆంజనేయప్రాపితాద్రిః పార్శ్వస్థవినతాసుతః || 2 ||
నిమగ్నమందరధరః కూర్మరూపీ బృహత్తనుః |
నీలకుంచితకేశాంతః పరమాద్భుతరూపధృత్ || 3 ||
కటాక్షవీక్షణాశ్వస్తవాసుకిః సింహవిక్రమః |
స్మర్తృహృద్రోగహరణో మహావిష్ణ్వంశసంభవః || 4 ||
ప్రేక్షణీయోత్పలశ్యామ ఆయుర్వేదాధిదైవతమ్ |
భేషజగ్రహణానేహః స్మరణీయపదాంబుజః || 5 ||
నవయౌవనసంపన్నః కిరీటాన్వితమస్తకః |
నక్రకుండలసంశోభిశ్రవణద్వయశష్కులిః || 6 ||
దీర్ఘపీవరదోర్దండః కంబుగ్రీవోఽంబుజేక్షణః |
చతుర్భుజః శంఖధరశ్చక్రహస్తో వరప్రదః || 7 ||
సుధాపాత్రోపరిలసదామ్రపత్రలసత్కరః |
శతపద్యాఢ్యహస్తశ్చ కస్తూరీతిలకాంచితః || 8 ||
సుకపోలః సునాసశ్చ సుందరభ్రూలతాంచితః |
స్వంగులీతలశోభాఢ్యో గూఢజత్రుర్మహాహనుః || 9 ||
దివ్యాంగదలసద్బాహుః కేయూరపరిశోభితః |
విచిత్రరత్నఖచితవలయద్వయశోభితః || 10 ||
సమోల్లసత్సుజాతాంసశ్చాంగులీయవిభూషితః |
సుధాగంధరసాస్వాదమిలద్భృంగమనోహరః || 11 ||
లక్ష్మీసమర్పితోత్ఫుల్లకంజమాలాలసద్గలః |
లక్ష్మీశోభితవక్షస్కో వనమాలావిరాజితః || 12 ||
నవరత్నమణీక్లుప్తహారశోభితకంధరః |
హీరనక్షత్రమాలాదిశోభారంజితదిఙ్ముఖః || 13 ||
విరజోఽంబరసంవీతో విశాలోరాః పృథుశ్రవాః |
నిమ్ననాభిః సూక్ష్మమధ్యః స్థూలజంఘో నిరంజనః || 14 ||
సులక్షణపదాంగుష్ఠః సర్వసాముద్రికాన్వితః |
అలక్తకారక్తపాదో మూర్తిమద్వార్ధిపూజితః || 15 ||
సుధార్థాన్యోన్యసంయుధ్యద్దేవదైతేయసాంత్వనః |
కోటిమన్మథసంకాశః సర్వావయవసుందరః || 16 ||
అమృతాస్వాదనోద్యుక్తదేవసంఘపరిష్టుతః |
పుష్పవర్షణసంయుక్తగంధర్వకులసేవితః || 17 ||
శంఖతూర్యమృదంగాదిసువాదిత్రాప్సరోవృతః |
విష్వక్సేనాదియుక్పార్శ్వః సనకాదిమునిస్తుతః || 18 ||
సాశ్చర్యసస్మితచతుర్ముఖనేత్రసమీక్షితః |
సాశంకసంభ్రమదితిదనువంశ్యసమీడితః || 19 ||
నమనోన్ముఖదేవాదిమౌలిరత్నలసత్పదః |
దివ్యతేజఃపుంజరూపః సర్వదేవహితోత్సుకః || 20 ||
స్వనిర్గమక్షుబ్ధదుగ్ధవారాశిర్దుందుభిస్వనః |
గంధర్వగీతాపదానశ్రవణోత్కమహామనాః || 21 ||
నిష్కించనజనప్రీతో భవసంప్రాప్తరోగహృత్ |
అంతర్హితసుధాపాత్రో మహాత్మా మాయికాగ్రణీః || 22 ||
క్షణార్ధమోహినీరూపః సర్వస్త్రీశుభలక్షణః |
మదమత్తేభగమనః సర్వలోకవిమోహనః || 23 ||
స్రంసన్నీవీగ్రంథిబంధాసక్తదివ్యకరాంగుళిః |
రత్నదర్వీలసద్ధస్తో దేవదైత్యవిభాగకృత్ || 24 ||
సంఖ్యాతదేవతాన్యాసో దైత్యదానవవంచకః |
దేవామృతప్రదాతా చ పరివేషణహృష్టధీః || 25 ||
ఉన్ముఖోన్ముఖదైత్యేంద్రదంతపంక్తివిభాజకః |
పుష్పవత్సువినిర్దిష్టరాహురక్షఃశిరోహరః || 26 ||
రాహుకేతుగ్రహస్థానపశ్చాద్గతివిధాయకః |
అమృతాలాభనిర్విణ్ణయుధ్యద్దేవారిసూదనః || 27 ||
గరుత్మద్వాహనారూఢః సర్వేశస్తోత్రసంయుతః |
స్వస్వాధికారసంతుష్టశక్రవహ్న్యాదిపూజితః || 28 ||
మోహినీదర్శనాయాతస్థాణుచిత్తవిమోహకః |
శచీస్వాహాదిదిక్పాలపత్నీమండలసన్నుతః || 29 ||
వేదాంతవేద్యమహిమా సర్వలోకైకరక్షకః |
రాజరాజప్రపూజ్యాంఘ్రిః చింతితార్థప్రదాయకః || 30 ||
ధన్వంతరేర్భగవతో నామ్నామష్టోత్తరం శతమ్ |
యః పఠేత్సతతం భక్త్యా నీరోగః సుఖభాగ్భవేత్ || 31 ||
ఇతి బృహద్బ్రహ్మానందోపనిషదాంతర్గతం శ్రీ ధన్వంతర్యష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.